కోతి పిల్ల ప్రాణం కోసం... ఆ ముగ్గురు....

అది జాతీయ రహదారి. వేలాది వాహనాలు రయ్యి...రయ్యి మంటూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే కోతుల గుంపు రోడ్డు దాటు తున్నాయి. ఇంతలో ఒక కారు కోతి పిల్లను ఢీ కొట్టడంతో అక్కడే స్పృహ కోల్పోయింది. అంతే కోతులు మూక అన్ని రోడ్డు మీద వాహనాలు తిరగకుండా హల్ చల్ చేశాయి. ఇలా ఐదు నిమిషాలు పాటు రహదారి పై కోతులు వీరంగం సృష్టించాయి. ఇంతలో ఒక సాఫ్టు వేర్ ఉద్యోగం చేసే యువకుడు బైకు పై వచ్చి నడి రోడ్డు పై పడిన కోతి పిల్లను కాపాడాలని చూసాడు. వెహికిల్స్ వేగంగా వస్తున్నాయి. కోతులు వాహనదారులు ను బెదర కొడుతున్నాయి. ఇంతలో అటుగా వెళ్ళే ఒక వికలాంగుడు ట్రై సైకిల్ మీద వచ్చి వాహనాలు రాకుండా రోడ్డు పై పడిన కోతి పిల్ల కు తన వెహికిల్ అడ్డు పెట్టి ట్రాఫిక్ మళ్ళించాడు. సాఫ్టు వేర్ యువకుడు తన చేతుల తో స్పృహ కోల్పోయిన కోతి పిల్లను రోడ్డు పక్కనే ఉన్న ఒక బండ రాయి పై పడుకో బెట్టాడు. అదే సమయంలో ఆ ట్రాఫిక్ లో వెళ్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు అంబులెన్స్ వచ్చి ఆగింది. అంబులెన్స్ డ్రైవర్ ముత్తేశ్వరావు మెడికల్ కిట్ తీసుకొని కోతి పిల్లను చేతిలోకి తీసుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ చేశాడు. కోతి గుండె స్పందన చెక్ చేసి...కోతిని ఎలాగైనా బ్రతికించాలని CPR ట్రీట్ మెంట్ చేశాడు. తన చేతి వేళ్ళతో కోతి గుండె పై ప్రెస్ చేస్తూ...గుండె స్పందిస్తుందేమో అని చాలా ప్రయత్నం చేశాడు. కొద్ది నిమిషాలు ప్రయత్నం చేసి కోతి చనిపోయిందని గ్రహించి కోతి కళేబరాన్ని అక్కడే అదే రాయి మీద ఉంచి వెళ్ళిపోయాడు. కొద్ది నిముషాల పాటు స్పందించిన కోతి గుండె చివరకు ఆగిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ ముత్తేశ్వరావు కు మనిషైనా...జంతువు వైనా...ప్రాణం కాపాడటం తన కర్తవ్యంగా భావించి మూగ జీవైన ప్రాణాలు కాపాడేందుకు భాధ్యత గా ఎంతో ప్రయత్నం చేశాడు...అలాగే సాఫ్టు వేర్ ఉద్యోగం చేసే యువకుడు వేమిరెడ్డి కూడా మానవత్వం చాటేందుకు ముందుకు వచ్చాడు. మనుషుల కే కాదు...ప్రతి జీవి ప్రాణం...ప్రాణమే అని గ్రహించి మూగ జీవం పట్ల ప్రేమను చాటి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్న కోతి ని చేతులతో తీసుకొని రోడ్డు పక్కన ఉంచాడు. అదేవిధంగా తనకు కాళ్ళు లేని వికలాంగుడు అయినప్పటికీ మూడు చక్రాల బైకు తో వాహనాలకు అడ్డుగా ఉంచి తన వంతు సహాయంగా కోతి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేశాడు. నేషనల్ హైవే పై యాక్సిడెంట్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి ప్రాణాలు కాపాడేందుకు ముగ్గురు యువకులు చేసిన ప్రయత్నం తోటి వాహన దారులకు కళ్ళు తెరిపించాయి. మనుషుల్లో ఇంకా మానవత్వం దాగి ఉందని చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనం.