సీఎం రేవంత్ సైకిత శిల్పం ఎక్కడుందో తెలుసా

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ సాండ్ ఆర్ట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా జరిగిన ఈ ఏర్పాట్లు ప్రజాదరణను సంతరించుకుంటున్నాయి. ఈ కళాఖండాన్ని విజయవాడకు చెందిన యువ సైకిత కళాకారుడు, శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ రూపొందించాడు. ఆయన ప్రత్యేకంగా నెల్లూరు నుంచి నాణ్యమైన సాండ్‌ను తెప్పించి, ట్యాంక్ బండ్‌ సాగరతీరంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని రూపొందించడం విశేషం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో సాండ్ ఆర్ట్ చేయడం ఇదే మొదటిసారి. సాండ్‌పై సీఎంను ప్రతిబింబించిన తీరు ప్రజలను ఆకర్షిస్తోంది.