సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఇదీ ఓవరాల్‌గా వైసీపీ సెకండ్ లిస్ట్ సారాంశం!. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయ్!. వీళ్లల్లో ఐదారుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు ఉన్నారు.