ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహా మనిషి, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా మారింది. హిందువుల పెద్ద పండగ సంక్రాంతి సంబరాలకు కొనసాగింపుగా జనవరి 19వ తేదీన విజయవాడ నగరంలోని బీడబ్ల్యూడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.