క్యాన్సర్ బారిన పడిన చిన్నారి.. మానవత్వం చాటుకున్న కలెక్టర్ 10 లక్షల ఆర్ధిక సాయం

చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. వీర్నపల్లి మండల తహసిల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించి అందులో వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.