Viral Video: బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..

Viral Video: బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని.. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్న అతడు బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది. అప్పుడు టూ వీలర్ నడపడం వీలు పడలేదు. కష్టపడి కొనుకున్న కొత్త వాహనాన్ని వదిలి వేయాలని అనిపించలేదు. ఆ వాహనాన్ని తలపై పెట్టుకొని నడవడం ప్రారంభించాడు. వరద ప్రవాహం పెరుగుతోన్న.. దాదాపు 100 మీటర్ల వరకు నడిచాడు.