వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట.. ఆందోళనలో రైతులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోగా, ఇప్పటికే కాసిన పిందెలు నేలకొరిగాయి. జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల్లో రాత్రి వేళ కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి, ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంభీరావుపేట మండలంలో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, రాళ్లతో కూడిన వర్షం కురిసింది.