పారిస్ ఒలింపిక్స్ 2024లో పారిస్‌లోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్‌లో ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరచింది. దీంతో మనుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మను భాకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు