ఒక కిరాణ షాపు యజమాని నిత్యం షాపు తెరవగానే పూజలు చేస్తున్నాడు. పూజ చేసిన కాసేపటికే అతని వద్దకు ప్రతి రోజు లక్ష్మి దేవి స్వరూపంగా భావించే గోమాత వస్తుంది. ఆ షాపు యజమాని ప్రేమగా పెట్టే పిండి పదార్థాలు, బెల్లం, పప్పులు తిని వెళ్తోంది. ఇలా రోజు జరుగుతున్న తంతును చూసి స్థానికులు అశ్చర్యపోతున్నారు.