డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే కారు డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా.. అలాగే సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం పోయాక ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు నుంచి జారి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది.