బంగ్లాదేశ్ రణరంగంగా మారింది. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మంగళవారం రాత్రి పగ్గాలు చేపట్టారు. అయితే అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ నేత స్టార్ హోటల్‌కి అల్లరిమూక నిప్పంటించారు. జోహోర్ జిల్లాలో అవామీ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షహిన్ ఛక్లదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషన్ హోటల్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.