శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపాము జాతికి చెందిన ఓ జీవి హాల్ చల్ చేసింది. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది. చూడటానికి వానపామును పోలినట్టుగానే ఉన్నా.. పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా సుమారు 12 అంగలాలు పొడవు ఉంది. ఇది నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ వింతగా కనిపించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకం ఏంటంటే దాని తల చివర సుత్తిలాంటి ఆకారం ఉండటం. ఇది చూపరులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.