Rooster For Auction At Karimnagar

మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు కోడిని వేలం వేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. కోడి వేలంలో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది.. కోడి తానదేనంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి..