బెంగళూరులో బుధవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా బీఎంటీసీ డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుకు గురై సీటుపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ను గమనించిన కండక్టర్ ఓబలేశ్ వెంటనే డ్రైవర్ సీటుపైకి ఎక్కి స్టీరింగ్ పట్టుకుని బస్సును అదుపు చేశారు. అనంతరం డ్రైవర్‌ను కాపాడేందుకు కండక్టర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.