ఏకంగా గంట పాటు శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చిన నాగుపాము

రాజమండ్రి పుష్కర ఘాట్ శివాలయంలో నాగుపాము శివలింగానికి చుట్టుకుని దర్శనమివ్వడం భక్తులలో ఆనందాన్ని, సంభ్రమాశ్చర్యాన్ని కలిగించింది. అరుదైన ఈ సంఘటనను శివుని అనుగ్రహంగా భావిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఘటన తాలుకా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది .