స్నేహానికి మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. స్నేహానికన్న మిన్న ఈ లోకానా లేదురా..అనే కూడా సాంగ్ ఉంది. సరిగ్గా అలానే ఎల్లలు దాటి స్నేహం కోసం...స్నేహానికి విలువిస్తూ దేశం కాని దేశం నుంచి స్నేహితుని పెళ్లి వేడుకను కనులారా చూసి నూతన దంపతులకు ఆశీర్వాదం ఇచ్చేందుకు జర్మనీ దేశానికి చెందిన ఒక విదేశీ జంట ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన స్నేహితుని వివాహానికి హాజయ్యారు.