బయట ఫుడ్‌ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. జన్మలో వాటి జోలికి వెళ్లరు..

ఈ మధ్య కాలంలో చాలా మంది బయటఫుడ్‌ను ఎక్కవగా ఇష్టపడి తింటున్నారు. కానీ వ్యాపారులు వాటిని ఎలా తయారు చేస్తున్నారు. వాటి తయారీలో నాణ్యమైన పదార్థాలు వాడుతున్నారా లేదా అనేది మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్లి లాగించేస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సంఘటన చూస్తే మీరు మరోసారి బయటఫుడ్‌ తినాలంటేనే భయపడతారు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని విజయ్ విహార్ కాలనీలో ఉన్న కరీం హోటల్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడు.. రోటీలు తాయారు చేసే క్రమంలో దానిపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే షాకింగ్ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు హోటల్‌ కార్మికుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.