స్కెచ్ మామూలుగా లేదుగా.. సినీ పక్కీలో రూ.3 లక్షలు మాయం..! నారాయణపేట జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది. ప్రధాన రహదారి పక్కనే పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. పక్కా స్కెచ్ వేసి చోరీ చేసి చిక్కకుండా చెక్కేశారు. సీసీ టీవీ ఫుటేజీ అసలు గుట్టు బయటపెట్టింది.