హిందువులు జరుపుకునే పండగలలో హనుమాన్ జయంతి ఒకటి. అయితే ఈ హనుమాన్ జయంతిని ఒకొక్క రాష్ట్రంలో ఒకోక్క సారి జరుపుకుంటారు. తాజాగా తమిళనాడులోని ప్రముఖ నమక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాయు పుత్రుడి జన్మ దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రత్యేకంగా అలంకరించారు. భారీ వడమాలను స్వామివారికి సమర్పించారు.