వైన్స్‌ బంద్‌ రోజే ప్రభుత్వ ఉద్యోగుల మద్యం విందు!

సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విందు పార్టీ చర్చనీయాంశంగా మారింది. సుమారు 100 మంది PETలు ఈ విందులో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ సందర్భంగా కొందరు మద్యం సేవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మద్యం బంద్ ఉన్నరోజు విందు, జల్సాలు జరుపుకోవడం దుమారం రేపుతోంది.