అల్లూరి సీతారామరాజు జిల్లా పిఆర్పురం మండలం రేకపల్లిలో వనదేవతల ఉత్సవం వైభవంగా జరిగింది. మేళతాళాల, డప్పుల సందడి, భక్తుల జయజయధ్వానాలతో వనదేవతలు ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై కొలువుదీరిన వేళ వేలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.