లవర్‌ సవాల్‌ చేయడంతో సముద్రంలోకి కారును నడిపాడు

లవర్‌తో పందెం కాసి, ఓ యువకుడు కారును ఏకంగా సముద్రంలోకి తీసుకెళ్లి ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. చెన్నై నుంచి గురువారం ఐదుగురు యువకులు కారులో చిదంబరానికి బయలుదేరారు. కడలూర్‌ హార్బర్‌-పరంగిపేట తీరప్రాంతం ఆగినవారు మద్యం సేవించారు. ఆపై సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని పందెం వేసుకున్నారు.