టీవీ9 కాలిఫోర్నియా ప్రతినిధి సుగుణ రెడ్డికి అరుదైన గౌరవం

అమెరికాలోని కాలిఫోర్నియాలో టీవీ9 ప్రతినిధిగా సేవలందిస్తున్న సుగుణ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో టీవీ మీడియా రంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ "ట్రైల్‌బ్లేజర్ ఉమెన్" అవార్డుకు సుగుణరెడ్డిని ఇండో అమెరికన్ల సంఘం ఎంపిక చేసింది.