40 ఏళ్లుగా నిమజ్జనం చేయని దుర్గమ్మ విగ్రహం! ఏటా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు
రాజన్న సిరిసిల్లలోని జగదాంబ సేవా సంఘం దేవీ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా, ప్రతి ఏడాది అదే విగ్రహానికి పూజలు నిర్వహిస్తోంది.