భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కీలక అప్ డేట్! భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జెట్ స్పీడ్ తో పనులు సాగుతూ మరికొద్ది నెలల్లో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తూ భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పదిహేను నెలల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే దూసుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తోంది.