ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరో ఘనత.. మూడేళ్ల బాలుడికి అరుదైన లివర్‌ శస్త్ర చికిత్స

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మోదుగు చోహన్ ఆదిత్య (3) అనే చిన్నారికి పుట్టుకతో వచ్చే బిలియరీ అట్రేసియా (congenital biliary atresia) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్న వారిలో కాలేయ వైఫల్యం జరుగుతుంది. ఆదిత్యకు కూడా కాలేయ మార్పిడి చేయవల్సి వచ్చింది.