పొలం పనులు చేస్తుండగా.. గడ్డిలోంచి విచిత్ర శబ్ధాలు.. ఏంటా అని చూడగా.

మొన్నటి వరకు భారీ వర్షాలు కురిశాయి. వాగులు..వంకలు పొంగి పొర్లాయి. దీంతో కొండల్లో.. గుట్టల్లో ఉన్న పాములు, కొండ చిలువలు పొలాల్లో దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే పొలాలకు వెళ్లి రైతులు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇలానే పొలానికి వెళ్లిన ఒక రైతుకు భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.