ప్రభుత్వ అధికారులకు ప్రజల ధనం అంటే విలువ లేకుండా పోయింది. ప్రజలు డబ్బుతో జీతాలు తీసుకుంటూ వారు కట్టిన పన్నులతో యంత్రాగాన్ని నడుపుతూ ప్రజాధనాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేలులో జరిగింది. పశువులకు వేయాల్సిన వ్యాక్సిన్ మందులను సిరంజిలను ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉండగానే రోడ్డుపాలు చేశారు. పశువైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ సంఘటన. బద్వేల్ పోరుమామిళ్ల బైపాస్ రోడ్డు నాగులచెరువు వద్ద వ్యాక్సిన్లు, సిరెంజులు పారవేసి దర్శనమిచ్చాయి. పశువుల వ్యాక్సినేషన్ మందులు, సిరంజులు.. పెద్ద మొత్తంలో పారవేయడంపై స్దానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారుల తీరును తప్పుపట్టారు ప్రజలు. నిర్లక్ష్యానికి పరాకాష్టగా పశు వైద్యాధికారుల వ్యవహారం ఉందని మండిపడుతున్నారు. పారవేసిన మందులపై ఎక్స్పైరీ డేట్ 8వ నెల 24వ సంవత్సరం వరకు ఉన్నప్పటికీ రోడ్డుపై దర్శనమిచ్చాయి.