బీర్ కోసం రోడ్డుపై కారు ఆపేసి ఓ యువకుడి హల్ చల్ చేశాడు. ఓ యువకుడు కారులో వెళ్తుండగా సిగ్నల్ పడింది. అదే సమయంలో ఓ వైన్ షాప్ అతడికి కనిపించింది. వెంటనే అతడు కారు రోడ్డుపై నిలిపివేసి వైన్ షాపుకు వెళ్లి చల్లగా బీర్ తాగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేవలం మందుకోసం కారు రోడ్డుపై నిలిపేసి ఇతరులను ఇబ్బంది పెట్టడం స్టుపిడ్ థింగ్, మందు కోసం కారు తీసుకొని వెళ్లొచ్చుగా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.