పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు.. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడిపోతే.. అదే బైక్‌పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్‌పై అలాగే కూర్చుంది. ఇక బైక్ కూడా ఎవరో నడుపుతున్నట్లు తొనక్కుండా బెనక్కుండా ఎవరూ డ్రైవ్ చేయకుండానే రోడ్డుపై ఇతర ఏ వాహనాలను ఢీ కొట్టకుండా చాలా దూరం వెళ్లింది. అలా వెళ్లిన బైక్ రోడ్డు పక్కన ఉన్న చెట్ట పొదను ఢీ కొట్టడంతో చిన్నారి సురక్షితంగా ఫుట్‌పాత్ గడ్డిపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ వీడియో చూసేయండి..