సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థుల ఆందోళన

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో బాంబుల మోత కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఎన్‌ఐటీలో మొత్తం 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.