ఆదిలాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ ఒక గొర్రెను చుట్టేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్ణం అటవీ సమీపంలో గొర్రెల కాపరి గొర్రెలు మెపుతుండగా భారీ కొండచిలువ మందలోంచి ఒక గొర్రెను చుట్టేసుకుంది. అది చూసిన కాపరి భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు.