బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు సజీవ దహనం..

తమిళనాడులోని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం పేలుడు సంభవించడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో కర్మాగారం నుంచి భారీగా పొగ ఎగిసిపడింది.