కాకే కదా అని కట్టేస్తే.. వందలాదిగా దండెత్తాయి..

కాకే కదా అని కట్టేస్తే.. వందలాదిగా దండెత్తాయి.. ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో.. మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.