ప్రేమగా జనాలకు జ్యూస్ ఇచ్చాడు.. తాగిన కాసేపటికే అంతా షాక్.. ఏం జరిగిందో తెలుస్తే..

హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఆ జ్యూస్ తాగిన 12 మంది అకస్మాత్తుగా నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 15 గంటల తర్వాత నిద్రలేచారు. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం గమనార్హం