ట్రంప్‌పై హత్యాయత్నం.. సీన్‌ రీక్రియేట్‌ చేసిన పిల్లలు

ట్రంప్‌పై కాల్పులు జరిగిన వీడియోలను చూసిన ఉగాండాకు చెందిన కొందరు చిన్నారులు సీన్ రీక్రియేట్‌ చేశారు. చెక్క తుపాకులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, కర్ర బొమ్మలు ఉపయోగించి ఆ రోజున ఏం జరిగిందో అచ్చం అదేమాదిరి నటించడమేకాదు.. ఏకంగా జీవించేశారు. ఇందుకు సంబంధించిన టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.