హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత సిన్వర్ హతం

హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడుల వెనుక సిన్వర్ సూత్రధారిగా ఉన్నారు. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చిన హంతకుడు మరణించాడంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇది అతిపెద్ద విషయంగా అభివర్ణించారు. గాజాతో యుద్ధంలో ముగింపు దశ ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలను అభినందించాడు.