ఆ మూడు కిలోమీటర్లు.. నిండు గర్భిణీకి కష్టాలు..

అల్లూరి ఏజెన్సీలో గిరిజనులకు రహదారి కష్టాలు అన్ని ఇన్ని కావు. అత్యవసర సమయాల్లో అయితే.. ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను తరిలించాలన్నా.. ఎవరైనా అనారోగ్యం పాలైనా, ఏదైనా పామో, పురుగో కాటేసినా.. ఇలా అత్యవసర సమయంలో తరలించాలంటే డోలి కట్టాల్సిందే..!