వైసీపీ కార్యాలయానికి అనుమతులెక్కడ? జీవీఎంసీ నోటీసులు.

వైసీపీ కార్యాలయానికి అనుమతులెక్కడ? జీవీఎంసీ నోటీసులు. ఒక వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.