ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఉదయం 6 గంటలకే బయటకు అడుగుపెడితే కానీ.. మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి ఏ రాత్రో అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు నిమిషం ఆలస్యం చేయకుండా ప్రచారంలో బిజిబిజీగా ఉంటున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ తన చాపర్ లో చేపలు తింటూ అందుకు సంబంధించిన వీడియో ను పోస్ట్ చేశాడు.