దేశంలోని పలు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాబోయే 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు రాష్ట్రాలకు హెచ్చరించింది వాతావరణ శాఖ.