నంద్యాల జిల్లా రాజకీయాల్లో సంచలనం

నంద్యాల జిల్లా రాజకీయాల్లో సంచలనం నంద్యాల జిల్లా రాజకీయ సంచలనం జరిగింది. ప్యాపిలిలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించడం సంచలనంగా మారింది. వాస్తవంగా ప్యాపిలిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలని 12 ఏళ్ల క్రితమే కమతం భాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు కోట్ల విగ్రహం ఆవిష్కరణకు నోచుకోలేదు. విగ్రహానికి బట్ట చుట్టి మూసేశారు. ప్రస్తుత ఎన్నికలవేళ విగ్రహం గురించి చర్చ జరిగింది.