పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఉగాండాకు చెందిన కొండ జాతి కోతులను ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ అరుదైన కొండ కోతుల అక్రమ రవాణా వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖాధికారులు. తాజాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తుండగా కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్న వాహనంపై ప్రత్యేక బోనులో రెండు కోతులను తరలిస్తున్నట్లు గుర్తించారు.