ఒకవైపు తండ్రి మరణం.. మరోవైపు పదో తరగతి పరీక్ష

ఒకవైపు తండ్రి మరణం.. మరోవైపు పదో తరగతి పరీక్ష ఎవ్వరికైనా.. కన్న తండ్రి అంటే కొండంత ధైర్యం. అందులోనూ పరీక్షలు వచ్చాయంటే, భుజం తట్టి ఎంకాదు, ధైర్యంగా పరీక్షలు రాయమని ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చే కన్న తండ్రి అనుకోకుండా అనారోగ్యంతో మృతి చెందాడు. తెల్లవారితే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. తండ్రి అంత్యక్రియలు ఒక వైపు. కొడుకు భవిష్యత్తు పరీక్ష మరో వైపు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని ఉదయాన్నే పదో తరగతి పరీక్షలకు వెళ్ళాడు. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చాక, కళ్ళలో దాగిన భాధను కన్నీటి రూపంలో కారుస్తూ తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నాడు ఒక పదో తరగతి విద్యార్థి