ముఖ్యమంత్రి సారూ.. నమస్తే.. నేను గుర్తున్నానా.. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళన ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మీరు నా సాయమే తీసుకున్నారు. అప్పుడు మీరు నా ట్రాక్టర్ ఎక్కే విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బాసర ట్రిపుల్ ఐటీ చేరారు. విద్యార్థుల పక్షాన పోరాటం చేసేందుకు ఛలో ట్రిపుల్ ఐటీ అంటూ గర్జించి.. యూనివర్సిటీ గోడలు దూకి ఆందోళనలో పాల్గొన్నారు. అంటూ నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీడియో సందేశాన్ని పంపారు.