శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..

సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్‏తోపాటు తెలంగాణ ఎఫ్‏డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు.