దేశంలో రాజ్యాంగానికి,మనుస్మృతికి మధ్య ఘర్షణ-రాహుల్‌

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చలో విపక్ష నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఎందరో మేధావులు కష్టపడి రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదన్నారు రాహుల్‌. దేశంలో మనుస్మృతికి , రాజ్యాంగానికి పోరాటం జరుగుతోందన్నారు. మహాభారతంలో ఏకలవ్యుడిని బొటనవేలిని ద్రోణాచార్యుడు తీసుకున్నాడని , ఇప్పుడు అదానీ కోసం రైతులు , యువత హక్కులను మోదీ కాలరాస్తున్నారని విమర్శించారు.