సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ..

సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. A1 సతీష్‌ను 15 రోజులు కస్టడీకి కోరనున్నారు దర్యాప్తు అధికారులు. నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిమాండ్‌లో నిందితుడు సతీష్‌ పేరును పొందుపరిచారు. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.