లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..!

లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..! అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే.. అర్ధరాత్రి సమయం. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. నిద్ర మత్తు వచ్చిన లారీ డ్రైవర్లు తమ వాహనాలను సమీపంలోని పెట్రోల్ బంక్ ల వద్ద నిలిపి అద మరిచి నిద్రపోతున్నారు. సమయం పన్నెండు గంటలు దాటడం నిద్ర ముంచుకొస్తుండటంతో డ్రైవర్లకు చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పెట్రోల్ బంక్ లోని సిబ్బంది కూడా కుర్చీల్లో కూర్చొని నిద్ర మత్తులోకి జారుకుంటున్నారు. నకరికల్లు మండలం చల్లగుండ్ల పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. దీంతో కారుపై అనుమానం వచ్చిన లారీ డ్రైవర్ పెట్రోల్ బంక్ సిబ్బందికి చెప్పి సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించారు. స్పష్టంగా కారు లారీ పక్కనే పార్క్ చేయడం డ్రైవర్ కారు చుట్టుపక్కల తిరుగాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది.