నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరగడంతో 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత 583 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293 టీఎంసీలకు నీరు చేరింది. రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఈ సుందర దృశ్యం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది.